టీఎస్పీఎస్సీ పరీక్షలో నిర్లక్ష్యం
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో మారుతీనగర్ సక్సెస్ కళాశాలలో జరిగిన టీఎస్పీఎస్సీ పరీక్షలో గ్రూప్ 4 రాస్తున్న అభ్యర్థ వద్ద మొబైల్ దొరికింది. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఈ మొబైల్‌ను గుర్తించారు. ఇన్విజిలేటర్ మొబైల్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతనిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసి, ఫోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనితో మరోసారి టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం బయటపడింది. గతంలో లీకేజిల వ్యవహారంలో దెబ్బతిన్నా కూడా ఇంకా సరైన సెక్యూరిటీ చెకింగ్ జరపలేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. మొబైల్‌తో లోపలికి ఎలా పరీక్ష హాలులోకి ప్రవేశించాడని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం సాధారణమేనని, దీనివల్ల పరీక్షలకు ఎలాంటి అవాంతరం ఉండదని, మొదటి పేపర్ పూర్తయ్యిందని, రెండవ పేపర్ మధ్యాహ్నం ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

