నీట్ ఫలితాలు వెల్లడి-ఇద్దరికి 720 కి 720 మార్కులు
జాతీయ స్థాయిలో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇద్దరు విద్యార్థులు 720 మార్కులకు 720 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించారు. వారిలో ఒకరు తమిళనాడుకు చెందిన ప్రభంజన్ కాగా మరొకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోర వరుణ్ చక్రవర్తి. తెలంగాణాకు చెందిన రఘురాం రెడ్డి 15 వ ర్యాంకు సాధించారు. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె.యశశ్రీకి రెండవ ర్యాంకు వచ్చింది. మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కావడం విశేషం. ఏపీకి చెందిన బోర వరుణ్ చక్రవర్తి తండ్రి రాజేంద్రనాయుడు నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. ఇక తమిళనాడుకు చెందిన ప్రభంజన్ తండ్రి జగదీష్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈసారి నీట్ ఫలితాలలో యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర నుండి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నారని NTA తెలియజేసింది. టాప్ 50 అభ్యర్థులలో 40 మంది అబ్బాయిలే ఉన్నారు. 10 మంది మాత్రమే అమ్మాయిలు టాప్ ర్యాంకర్లగా నిలిచారు.

