జూలై 20న NEET ఫలితాలు విడుదల -సుప్రీంకోర్టు
జూలై 20న NEET ఫలితాల వెల్లడిచేసుకోవచ్చని సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది. మధ్యాహ్నం 12 గంటలలోపుగా ఈ ఫలితాలు ఇవ్వాలని పేర్కొంది. దీనిని ఒకే సారి కాకుండా పరీక్షా కేంద్రం, నగరాల వారీగా విడుదల చేయాలని సూచించింది. నీట్ -యూజీకి సంబంధించిన ఇతర పిటిషన్లను ఫలితాల అనంతరం జూలై 22న విచారిస్తామని పేర్కొంది. నీట్ పరీక్షలు లీకేజ్ విషయంలో ప్రభుత్వం, సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల వెల్లడి సమయంలో విద్యార్థుల వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించింది.