Home Page SliderTelangana

నీట్ పేపర్ లీక్, నలుగురు బీహార్ విద్యార్థులు అరెస్ట్

మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) వివాదం రాజుకుంటోంది. విద్యార్థుల పోరాటం, రాజకీయ పార్టీలను తాకింది. ఈ నేపథ్యంలో అసలు దోషులెవరు.. ఎక్కడ మొత్తం వ్యవహారం జరిగిందన్నదానిపై విచారణ క్షుణ్ణంగా సాగుతోంది. బీహార్ కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిచినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు విచారణ తీవ్రతరం చేశారు. నీట్ పేపర్ నఖలుతో పరీక్ష రాసిన ముగ్గురు అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం క్రితం రోజు తమకు లీక్ అయినట్లు పోలీసులు నిర్ధారించారు. డానాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజినీర్ సికందర్ యాదవెందు కూడా పేపర్‌లను లీక్ చేయడంలో తన పాత్రను అంగీకరించాడు. అనురాగ్ యాదవ్, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్, ముగ్గురు విద్యార్థులు, పరీక్షకు ముందు రోజు ప్రశ్నపత్రాన్ని అందుకున్నట్టు అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు.