NewsTelangana

మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్ 59.92 శాతం

మునుగోడులో పోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఓటెయ్యటానికి ఓటర్లు బార్లు తీరారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి మునుగోడులో 59.92% పోలింగ్ నమోదయింది. మొదటి నుంచి అనుకుంటున్నట్టుగా మునుగోడులో 90% పైగా ఓటింగ్ జరిగేలా వాతావరణం కనిపిస్తుంది. చెదురు మదురు ఘటనలు మినహా మునుగోడులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే స్థానికేతరులు… పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు బిజెపి విమర్శలు గుప్పిస్తోంది.