ఐటీ అనుమతి లేకుండానే NDTV , అదానీ చేతుల్లోకి
అదానీ గ్రూప్ దేశ వ్యాపార రంగంలో శరవేగంతో దూసుకుపోతోంది. అదానీ ఈమధ్యనే ప్రపంచంలోనే అపర కుబేరుల జాబితాలో చేరిపోయారు. అదానీ గ్రూప్ దేశంలోని అనేక సంస్థలలో వాటాలు కొనుగోలు చేస్తోంది. అలాగే తాజాగా వీసీపీఎల్‌ను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది.
NDTV ప్రమోటర్ సంస్థ అయిన RRPR హోల్డింగ్‌కు దశాబ్దం క్రితం VCPL 403 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చింది. RRPR కు అందించిన రుణాలకు గాను దీనిలో 99.5 శాతం వాటాను VCPL పొందనుంది. ఎప్పుడైనా ఈక్విటీగా మార్చుకోగల వారంట్లను కూడా VCPL పొందింది. అందుకోసం ఇటీవల ఈ వారంట్లను ఈక్విటీగా మార్చుకుంటున్నట్లు వెల్లడించింది.
ఇక NDTVలో RRPR కు 29.18 శాతం వాటా ఉంది. అందుకు గాను ఐటీ శాఖ అధికారుల అనుమతి అవసరమంటూ NDTV అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
అయితే మీడియా సంస్థ NDTVలో కొనుగోలుకు ఐటీ శాఖ అనుమతి అవసరం లేదని అదానీగ్రూప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాటా కొనుగోలుపై ఎలాంటి ఆంక్షలు ఉండకపోవచ్చని తెలియజేసింది.
Read more: మిస్త్రీ ప్రమాదం పై ఆనంద్ మహీంద్రా ట్వీట్

