Home Page SliderNational

NBK 109 అప్‌డేట్ రిలీజ్ చేసిన బాబీ

నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న NBK 109 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా జైపూర్‌లో చిత్రీకరించిన ఫైట్ సీన్ షూటింగ్ పూర్తయినట్లు బాబీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆయన ఎప్పుడూ ఒకే ఎనర్జీతో ఉంటారని, మోస్ట్ పవర్‌ఫుల్ సీన్స్‌లో బాలయ్య ఆవేశాన్ని చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. టైటిల్ టీజర్‌ను అతి త్వరలో రిలీజ్ చేస్తామని వెల్లడించారు.