తమిళనాట దుమారం రేపుతున్న నయనతార సరోగసీ వివాదం
లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆమె ఈ ఏడాది జూన్‌లో తమిళ డైరెక్టర్ విఘ్నేష్‌ను పెళ్లిచేసుకున్నారు. అప్పుడు కూడా ఆమె పెళ్లి నెట్టింట బాగా వైరల్ అయ్యింది. అనంతరం ఆమె పెళ్లి వీడియో వైరల్ అయిన విషయంలోనూ..ఓ ప్రముఖ సంస్థ నుంచి ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె తరచూ ఏదో ఒక విషయమై నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నయన తార దంపతులు చేసిన మరో పని ప్రస్తుతం తీవ్ర వివాదస్పదమైంది. అదేంటంటే నయనతార దంపతులు సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నయనతార దంపతులు స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో ఇది కాస్త తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంపై తమిళనాడు ఆరోగ్యశాఖ స్పందించింది. ఈ సరోగసీ చట్టబద్దమైనదేనా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని నయనతార దంపతులను కోరింది. ఈ మేరకు ఈ తీపికబురు కాస్త నయన్ దంపతులకు కొత్త కష్టాలు తీసుకు వచ్చిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాకుండా ఈ సరోగసీ విధానంపై పలువురు సినీ,సామాజిక ప్రముఖులు తీవ్రస్థాయిలో నయన్ దంపతులపై మండిపడుతున్నారు.