Home Page SliderNational

బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో నయన్ సినిమా..

నయనతార ఓ ప్రాజెక్ట్‌ని అంత ఈజీగా ఓకే చేయదు. ఎంతో ఆలోచించి తన పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి బేస్ చేసుకుని సినిమాలను ఒప్పుకుంటుంది. ఈ మధ్య నయన్ సినిమాలను తగ్గించింది. తనకు నచ్చిన కథలకు మాత్రమే ఓకే చెబుతోంది. మామూలుగా అయితే నయన్ లాంటి హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తామని కండిషన్స్ పెడుతుంటారు. కానీ ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో నటించేందుకు ససేమిరా ఒప్పుకోరు. కానీ నయన్, కెవిన్ కాంబోలో సినిమా రాబోతోంది.

లేడీ సూపర్ స్టార్ నయన్ తార తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ కెవిన్‌తో చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని ఈ పోస్టర్‌ను గమనిస్తుంటూనే అర్థం అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ గానీ ఇతర విషయాలను గానీ ప్రకటించలేదు. హాయ్ అని నయన్‌ ఏమో కెవిన్‌కు, కెవిన్ ఏమో నయన్‌కి ట్యాగ్ చేస్తూ పోస్టులు వేశారు. ఇక నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు సినిమా పోస్టర్‌ను షేర్ చేసింది. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కాసాగింది.నయన్ ప్రస్తుతం కంటిన్యూగా సినిమాలు చేయడం లేదు. ఆచితూచి కథలను ఎంచుకుంటోంది. పైగా నయన్ ఎక్కువగా తన ఫ్యామిలీ, పిల్లలతోనే గడిపేస్తోంది. నయన్ ఎక్కువగా సినిమాలు చేస్తే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో ఆఫర్లు వస్తూనే ఉంటాయి. కానీ నయన్ మాత్రం చాలా నిదానంగానే సినిమాలు చేస్తోంది. తనకు నచ్చిన సినిమాలను మాత్రమే ఎంచుకుంటోంది.తాజాగా నయన్ తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. కెవిన్‌తో నయన్ కలిసి ఓ సినిమాను చేస్తోంది. ఈ మూవీ పనులు సైలెంట్‌గా జరిగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ గమనిస్తుంటే.. నయన్ నుంచి మరో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. కెవిన్ కూడా డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తూ, తనలోని నటుణ్ణి వెలికి తీస్తున్నాడు.ఏది ఏమైనా ఈ జోడిని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. నయన్ లాంటి స్టార్ హీరోయిన్ ఇలా ఓ బిగ్‌బాస్  కంటెస్టెంట్ పక్క నటించేందుకు ఒప్పుకుందంటే.. కథలో చాలా విషయం ఉందనిపిస్తోంది. మరి ఈ చిత్రం గురించి మిగిలిన వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.