బస్సును తగులబెట్టిన నక్సల్స్
ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు కల్లోలం సృష్టించారు. దంతెవాడ జిల్లాలోని మాలేవాహి ప్రాంతంలో నారాయణపూర్ నుంచి వెళ్తున్న ప్యాసింజర్ బస్సును మావోయిస్టులు అడ్డుకున్నారు. అనంతరం బస్సులోని ప్రయాణికులను కిందికి దింపి బస్సుకు నిప్పు పెట్టారు. దీంతో ఆ బస్సు పూర్తిగా దగ్దమైందని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన అనంతరం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కాగా వారు అక్కడ ఉన్న ప్రయాణికులను సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ ప్రాంతమంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

