జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారయ్యారు. హస్తం పార్టీ ఆయన పేరును అధికారికంగా బుధవారం ప్రకటించింది.నవీన్ యాదవ్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. నవీన్ యాదవ్‌కు ప్రధాన బలం ఏమిటంటే, జూబ్లీహిల్స్‌లో మైనారిటీ , యాదవ సామజిక వర్గంలో ఆయనకు మంచి పట్టుంది . 2014 లో ఎంఐఎం పార్టీ తరుపున పోటీచేసిన ఆయన దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ కు గట్టి పోటీ ఇచ్చారు. ఇక ఆ తరువాత 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు . ఆ తరువాత 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన తరువాత పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ స్థానికంగా పాపులర్ అయ్యారు.ప్రజలకు అందుబాటులో ఉంటారని నియోజక వర్గం లో మంచి పేరుంది .