కాలిఫోర్నియాపై ప్రకృతి పడగ
అమెరికాపై ప్రకృతి మరోసారి కన్నెర చేస్తోంది. ఇప్పటి వరకూ మంచు తుపానులతో గజగజ వణికిన కాలిఫోర్నియాను భారీ తుపాను ముంచెత్తనుంది. అక్కడి ప్రభుత్వం తుపాను రాబోతోందని ప్రజలను అప్రమత్తం చేసింది. భారీ వర్షాల వల్ల, మంచు కరగడం వల్ల వరదలు ఏర్పడే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల కాలువలు, సరస్సులు పొంగి, నదుల్లో నీటి ప్రవాహం పెరగవచ్చని హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ఫసిపిక్ తీరంలోని మాంటిరే కౌంటీ తన ప్రజలకు రెండువారాలకు సరిపడా సరుకులు దగ్గర ఉంచుకోవాలని సూచించింది. వరదల నివారణకు ఇసుక బ్యాగులను కూడా దగ్గర ఉంచుకోవాలని జాగ్రత్తలు చెప్పింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు.

