ప్రకాశం జిల్లా కలెక్టర్ కు జాతీయ అవార్డు
ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాలను నియంత్రణకు విశేషంగా కృషి చేసిన కలెక్టర్ ను నేషనల్ అవార్డ్ వరించింది.ఈ మేరకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి బంగారు భవిష్యత్తు ఉన్న బాల్యానికి బాటలు వేసేలా గత ఐదేళ్ల నుంచి ఆలోచనాత్మక కార్యక్రమాలు చేపట్టిన కలెక్టర్ తమీమ్ అన్సారియాకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు లభించింది. బాల్య వివాహాల నివారణకై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ ‘బంగారు బాల్యం’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి విజయం సాధించారు.బాల్యంలో ఆడపిల్లలకు వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్ధాల గురించి నేరుగా సభల ద్వారా చైతన్యం తీసుకురావడంలో ఆమె సఫలీకృతులయ్యారు.దీంతో ఆమెను అవార్డు వరించింది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ జాతీయ అవార్డును అందుకోనున్నారు జిల్లా కలెక్టర్.

