నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి తంతు పూర్తి
గత కొద్ది రోజులుగా సాగుతున్న ప్రేమ బంధాన్ని పెళ్లి పీటలపైకి తెచ్చాడు సినీ నటుడు నరేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రను కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఒక పవిత్ర బంధం.. రెండు మనుసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు… అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. వివాహానికి మీ అందరి ఆశీస్సులు కావాలన్నాడు. గత కొద్ది రోజులుగా సినీ నటి పవిత్రతో నరేష్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. నరేష్ ప్రస్తుత వయస్సు 59 ఏళ్లు. ఫ్యామిలీ డ్రామా కొనసాగుతూనే ఉంది. ఆస్తి తగాదాలు ఉన్నాయి. మూడో భార్య రమ్య రఘుపతితో గొడవల తర్వాత (ఇంకా విడాకులు తీసుకోలేదు) నరేష్ నాల్గో వివాహం, పవిత్ర లోకేష్‌తో జరిగింది.