రిమాండ్ ఆర్డర్ క్వాష్ చేయాలని నరేందర్ పిటిషన్
తనకు సంబంధం లేకపోయినా లగచర్ల ఘటన కేసులో ఇరికించారని, కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ ని క్వాష్ చేయాలని కోరుతూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు.అయితే శుక్రవారం హైకోర్టుకు సెలవు కావడంతో బీఆర్ ఎస్ లీగల్ టీం సభ్యులు ఇవాళ హౌజ్ మోషన్ పిటీషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హౌజ్ మోషన్ కూడా వీలుకాకపోతే..ఇక కేసు విచారణ సోమవారానికే వాయిదా పడే అవకాశం ఉంది. తాను కేటిఆర్ పేరు చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్ లో ఉందని,తాను కేటిఆర్ పేరు చెప్పకపోయినా ఆయన పేరు ఇరికించారని,కావున రిమాండ్ ఆర్డర్ నే క్వాష్ చేయాలని కోరుతూ పట్నం పిటీషన్ వేయడం గమనార్హం.