Home Page SliderTelangana

నారాయణ కాలేజ్ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

నిజాంపేట్ బాచుపల్లిలోని నారాయణ కాలేజ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కాలేజీ హాస్టల్‌లో వారం రోజుల క్రితమే జాయిన్ అయిన వంశిక అనే విద్యార్థిని హాస్టల్‌లోని ఐదవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనితో అక్కడికక్కడే మరణించింది. కామారెడ్డికి చేరిన వంశికను గతవారమే తల్లిదండ్రులు హాస్టల్‌లో చేర్పించారు. ఈ ఉదయం ఆమె భవనం కింద రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన తోటి విద్యార్థులు కళాశాల నిర్వాహకులకు సమాచారం అందించారు. దీనితో పోలీసులకు వారు సమాచారమిచ్చారు. బాలిక బంధువులు, తల్లిదండ్రులు కళాశాల ప్రాంగణంలో ఆందోళనలు చేస్తున్నారు. వారం క్రిందటే ఇంటర్ ఫస్టియర్‌లో వంశికను జాయిన్ చేశామని, ఇంతలో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.