కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డిని తప్పించాలి: కేసీఆర్
తెలంగాణ: విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణలో ఏమాత్రం నిష్పాక్షికత కనిపించడం లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విచారణ అనేది పవిత్రమైన బాధ్యత. కానీ కమిషన్ ఛైర్మన్ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. అందుకే నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం శూన్యం అని లేఖలో పేర్కొన్నారు. కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డి తప్పుకోవాలని కేసీఆర్ సూచించారు.

