ముగిసిన నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో సీఐడీ నిన్నటి నుంటి లోకేష్‌ను విచారించడం ప్రారంభించింది. కాగా నిన్న ప్రారంభమైన లోకేష్ విచారణ నేటితో ముగిసింది. సీఐడీ విచారణ పూర్తైన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రెండు రోజులు సీఐడీ విచారణకు హాజరయ్యానన్నారు. దాదాపు 6 గంటలపాటు సీఐడీ నన్ను విచారించిందని లోకేష్ తెలిపారు. అయితే నిన్నటి ప్రశ్నలే ఈ రోజు కూడా అడిగారన్నారు. కాగా దాదాపు 47 ప్రశ్నలు తనను అడిగారు అన్నారు. ఈ కేసులో సీఐడీ కొత్తగా నాకు ఆధారాలు చూపించలేదన్నారు. అయితే నా తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ నాకు చూపించారన్నారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ మీకు ఎలా వచ్చాయని సీఐడీ అధికారులను లోకేష్ ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే మళ్లీ తనను విచారణకు పిలవలేదని లోకేష్ స్పష్టం చేశారు.