ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎంగా చంద్రబాబు,డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేసి..బాధ్యతలు స్వీకరించారు.ఈ నేపథ్యంలో ఈ రోజు ఏపీ ఐటీ,విద్యాశాఖ,RTG శాఖల మంత్రిగా నారా లోకేష్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పూజలు చేసిన లోకేష్ అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కార్యాలయంలో స్వల్ప మార్పుల కారణంగానే లోకేష్ బాధ్యతల స్వీకరణ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు నారా లోకేష్ పలు దస్త్రాలను పరిశీలించనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

