ఏపీలో నారా లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్:పేర్ని నాని
ఏపీలో టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై వైసీపీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో నారా లోకేష్ పాదయాత్ర అట్టర ప్లాప్ అయ్యిందన్నారు. కాగా 2014 ఎన్నికల్లో చంద్రబాబు 650 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఏపీలో లోకేష్‌ది పాదయాత్ర కాదు,జంపింగ్ జపాంగ్ యాత్ర అని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే మేనమామ కొడుకు చనిపోయిన ఆయన పాదయాత్ర ఆపలేదన్నారు. కానీ తన తండ్రి అరెస్ట్ అయినప్పుడు మాత్రం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారని ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు.