అమరావతి రింగ్‌రోడ్ కేసులో నిందితుడుగా నారా లోకేష్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ను నిందితుడిగా ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సిఐడి) పేర్కొంది. ఈ కేసులో లోకేష్‌ను నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసులో సిఐడి ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ అదే కోర్టులో ప్రిజనర్ ట్రాన్సిట్ (పిటి) వారెంట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కూడా అదే రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది.