Andhra PradeshHome Page Slider

ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్‌కు ఊరట

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా  తీవ్ర దుమారం సృష్టిస్తోంది. అయితే చంద్రబాబు అరెస్ట్ రాజేసీన  చిచ్చు చల్లారక ముందే ఆయన కుమారుడు లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.కాగా లోకేష్ కూడా ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో అక్రమాలకు పాల్పడ్డారని పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ కేసులో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం లోకేష్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుంది.ఈ క్రమంలో లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే ఆలోచన ఉంది అని లాయర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వ న్యాయవాది ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటివరకు లోకేష్‌ను నిందితుడిగా చేర్చలేదని స్పష్టం చేశారు. ఒకవేళ చేరిస్తే CRPC 41A నోటీసులిస్తామని న్యాయవాది తెలిపారు. 41A నిబంధనలు పాటించకపోతే కోర్టుకు విన్నవిస్తామని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.ఈ మేరకు నారా లోకేష్ సీఐడీ విచారణను హైకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది.