Andhra PradeshHome Page Slider

అక్టోబర్ 25 నుంచి నారా భువనేశ్వరి యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ ఏపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు “నిజం గెలవాలి” పేరుతో యాత్ర చేయనున్నారు. కాగా “నిజం గెలవాలి” యాత్రకు తాజాగా ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ మేరకు ఈ నెల 25 నుంచి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనతో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నారు. కాగా ఈ యాత్ర చంద్రగిరి నియోజక వర్గం నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రను ప్రారంభించే ముందు ఈ నెల 24న నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.