Andhra PradeshHome Page Slider

త్వరలో నారా భువనేశ్వరి ఓదార్పు యాత్ర

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య ఓదార్పు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ యాత్రకి ఇంకా పేరు ఖరారు కాలేదు కానీ గతంలో జగన్ నిర్వహించిన యాత్ర తరహాలోని ఈ లక్ష్యాలు స్పష్టమవుతున్నాయి. సోమవారం రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సత్యమేవ జయతే నిరాహార దీక్ష కార్యక్రమమలో శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన భువనేశ్వరి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందన్నారు. ఈ వార్తతో గుండెలవిసి ఇప్పటివరకు రాష్ట్రంలో 105 మందికి పైగా మరణించారన్నారు. వీరందరి కుటుంబాలకు తాను అండదండగా ఉంటానన్నారు. చంద్రబాబును విడుదల చేసిన అనంతరం వీరందరి కుటుంబాల వద్దకు వెళ్లి పలకరిస్తానన్నారు. వారికి ధైర్యం చెబుతానన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు.