Home Page SliderTelangana

రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నందమూరి వారసుడి మూవీ

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా తొలి చిత్రానికి రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రకటించారు మేకర్స్. మోక్షజ్ఞకు మొదటిచిత్రం కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని వెల్లడించారు. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే మోక్షజ్ఞ జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు ప్రశాంత్ వర్మ. దీనికి పాజిటివ్ స్పందన రావడంతో యూనిట్ అంతా ఖుషీగా ఉంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.