ఆ రోడ్‌కు రంగా పేరు పెట్టండి..షర్మిల
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. ఈ లేఖలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్‌కు వంగవీటి మోహన రంగా పేరును పెట్టాలని కోరారు. కాజా టోల్‌గేట్ నుండి చిన్న అవుటుపల్లి వరకూ 47.8 కిలోమీటర్ల దూరం ఉన్న బైపాస్ పూర్తయినందుకు సంతోషంగా ఉందని, దీనివల్ల ప్రజల ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయన్నారు. ప్రజలకు రంగా చేసిన సేవను మరిచిపోలేమని, అణగారిన వర్గాల కోసం ఆయన సేవలు గుర్తుంచుకుని, పేదల గుండెల్లో నిలిచిపోయిన రంగా పేరును ఈ రోడ్డుకు పెట్టాలని సూచించారు.

