Home Page SlidermoviesNational

చిరంజీవిపై నాగార్జున షాకింగ్ కామెంట్స్

అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రధానం వేడుకలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవికి బిగ్‌బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏఎన్నార్ అవార్డు బహుమతి ప్రధానం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్భంగా ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ చిరంజీవి డ్యాన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రి నాగేశ్వరరావు తాను సినీ ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు చిరంజీవి సినిమా షూటింగు చూపించి, చిరంజీవిలా డ్యాన్స్ చేయడం నేర్చుకో అని చెప్పారని పేర్కొన్నారు. ఆ డ్యాన్స్ చూసిన తాను, సినిమాలలోకి రాకుండా వేరే కెరీర్ ఎంచుకుందామని అనుకున్నానని నవ్వుతూ చెప్పారు. ఈ వేడుకలో అమితాబ్, చిరంజీవిలతో సరదాగా సంభాషిస్తున్న ఫోటోలను నాగార్జున పంచుకున్నారు. వారిద్దరికీ తన కృతజ్ఞతలు తెలిపారు.