Home Page SliderTelangana

మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ నాగార్జున

బాధ్యత గల పదవిలో ఉంటూ ఉచితానుచితాలు మరచిపోయి సెలబ్రెటీలపై తీవ్ర ఆరోపణలు చెయ్యొద్దంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు హీరో నాగార్జున. తన కుటుంబ విషయాలపై ఆమె చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. “రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను” అంటూ లేఖ రాశారు నాగార్జున. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే నాగచైతన్య మాజీభార్య సమంతాను తనవద్దకు కేటీఆర్ పంపమన్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. దీనికి సమంత ఒప్పుకోలేదని అందుకే విడాకులు తీసుకుందని పేర్కొన్నారు.  అలాగే రకుల్ ప్రీత్ సింగ్‌ను కూడా డ్రగ్స్ కేసులో కేటీఆరే ఇరికించాడని మీడియాతో కొండా సురేఖ ఆరోపణలు చేయడంతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. తన కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో హీరో నాగార్జున మండిపడ్డాడు. లేని పోని ఆరోపణలతో తన కుటుంబాన్ని బజారుకీడ్చవద్దని హెచ్చరించారు. ఆమె ఆరోపణలు అసంబద్దం, అబద్దం అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.