నాంపల్లి కోర్టులో నాగార్జున పరువునష్టం దావా
తనతో పాటు కుటుంబ గౌరవాన్ని రోడ్డుకీడ్చారని మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు హీరో నాగార్జున. మంత్రి సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసారని నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కొండాసురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే సినీ పరిశ్రమ భగ్గుమంటోంది. సినీ ప్రముఖులందరూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి, మరో మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, తమ రాజకీయ విమర్శలలోకి అక్కినేని కుటుంబాన్ని వివాదంలోకి లాగడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విచారణ రేపు, లేదంటే దసరా సెలవుల అనంతరం జరగవచ్చని సమాచారం. సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణమని, తనే హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశాడని విపరీత ఆరోపణలు చేయడంతో, ఆయన కూడా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు.

