రాజ్యసభ రేసులో నాగబాబు..
ఏపీ నుండి రాజ్యసభకు మూడు స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఈ రేసులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఉన్నట్లు సమాచారం. మూడు స్థానాలలో ఒకటి టీడీపీకి, మిగతా రెండిట్లో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరొకటి బీజేపీకి ఇవ్వొచ్చని బీజేపీ నుండి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. రాజ్యసభ సీటుకు రాజీనామా చేసిన బీద మస్తాన్ రావే టీడీపీ నుండి పోటీలో ఉన్నట్లు సమాచారం. అయితే టీడీపీ నుండి కంభంపాటి రామ్మోహన్రావు, గల్లా జయదేవ్ కూడా పోటీ పడుతున్నారు. ఈ రాజ్యసభ ఎన్నికకు వైసీపీకి ఆస్కారం లేదు. ఎందుకంటే ఒక్క రాజ్యసభ అభ్యర్థికి 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో వారికి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. అందుకే ఈ మూడు స్థానాలు కూటమి ప్రభుత్వానికే దక్కే అవకాశం ఉంది.