NewsTelangana

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఫోటో వైరల్

నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల శుక్రవారం పెద్దగా ట్రెండ్ అవుతూ కన్పించారు. ఇద్దరూ కలిసి ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతన్య, శోభితా ఫోటో సోషల్ మీడియాలో అభిమానుల పేజీల ద్వారా పోస్ట్ అవుతోంది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నల్లని దుస్తులలో జంటగా కనిపించారు. నాగ చైతన్య, మేడ్ ఇన్ హెవెన్ చిత్రంలో నటించిన శోభితా మధ్య ప్రేమ గురించి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పుకార్లు విన్పించాయి. డేటింగ్ పుకార్ల మధ్య నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల ఫోటో వైరల్ అవడం సంచలనంగా మారింది. కొన్ని నెలల క్రితం, RJ సిద్ధార్థ్ కన్నన్ ఇంటర్వ్యూలో శోభితా ధూళిపాళ్ల గురించి ప్రస్తావించగా… నాగ చైతన్య నవ్వుతానంటూ సమాధానం ఇచ్చాడు.

Naga Chaitanya And Sobhita Dhulipala's Pic Goes Viral Amid Dating Rumours

నాగ చైతన్య గతంలో సూపర్ స్టార్ సమంత రూత్ ప్రభుని వివాహం చేసుకున్నాడు. మనం, మజిలీ, ఏ మాయ చేసావే, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాల్లో కలిసి నటించారు. 2017లో వివాహం చేసుకున్నారు. మరియు గత ఏడాది అక్టోబర్‌లో ఉమ్మడి ప్రకటనలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.