మంత్రి రోజా పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు మంత్రి రోజా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.మెగా ఫ్యామిలీలో ఉన్న వారందరినీ కించపరిచేలా రోజా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన నాగబాబు…పర్యాటక శాఖ మంత్రిగా ఏపీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూడాలన్నారు. భారతదేశ పర్యాటకశాఖ ర్యాంకింగ్స్‌లో ఉన్న 20 స్థానాల్లో మొదటి మూడు స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్‌లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది.. నువ్వు ఇలాగే నీ బాధ్యతను మర్చిపోయి.. నోటికొచ్చినట్లు పిచ్చ పిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానంకు దిగజారే అవకాశం ఉంది’ అన్నారు. ఏపీ పర్యాటకశాఖ మీద కొన్ని వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా బతుకుతున్నారు. ఈ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ల జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. నువ్విలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ముందు పర్యాటశాఖ మంత్రిగా నీ బాధ్యతలు నువ్వు తెలుసుకో.. పర్యాటకశాఖ మంత్రి అంటే మీరు పర్యటన చేయడం కాదు. పర్యాటకశాఖను ఎలా డెవలప్ చేయాలో చూడాలి అంటూ ఘాటుగా స్పందించారు.
నువ్వు ఇన్ని రోజులు మా అన్నయ్య చిరంజీవి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, గురించి మీరు నోటికొచ్చినట్లు వాగినా కూడా నేను స్పందించకపోవడానికి ఒకటే ఒక్క కారణం ఉంది. మీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు.. చూస్తూ చూస్తూ మున్సిపాలిటీ కుప్పతొట్టిని గెలకరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటకశాఖను ఎలా డెవలప్ చేయాలో చూడు’ అంటూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

