‘శివం భజే’ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీస్
యంగ్ హీరో అశ్విన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘శివం భజే’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు అప్సర్ పూర్తి యాక్షన్ థ్రిల్లర్ కథగా తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను ఆగస్టు 1న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే, ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ బ్యానర్‌పై మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ కూడా రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులకు వరుసగా ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మైత్రీ మూవీస్. ఇక ‘శివం భజే’ సినిమా వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తులసి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మహేశ్వర రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండగా, వికాస్ బడియా సంగీతం అందించారు.

