Breaking Newshome page sliderHome Page SliderTelangana

మాజీ సర్పంచ్ హత్య కేసు మిస్టరీ వీడింది

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నందిన్నె గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ చిన్నభీమ రాయుడు ప్రాణాలు కోల్పోయారు. మొదట ఈ సంఘటనను రోడ్డు ప్రమాదంగా భావించగా, కుటుంబ సభ్యులు అది ఉద్దేశపూర్వక హత్య అని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు వారం రోజుల్లో కేసును ఛేదించారు.పోలీస్ ల దర్యాప్తు లో ఇది కేవలం ప్రమాదం కాదని హత్య అని తేల్చారు . రూ.25 లక్షల సుపారీ తీసుకుని నెల రోజుల పాటు రేక్కీ నిర్వహించి, పక్కా ప్రణాళికతో హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. హత్యను ప్రమాదంగా చూపించే విధంగా బొలెరో వాహనానికి ప్రత్యేక బంపర్‌ కూడా తయారు చేశారు.డిసెంబర్ 21న జాంపల్లి బస్టాండ్ సమీపంలో బొలెరో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టి చిన్నభీమ రాయుడిని చంపి పారిపోయారు. హత్యకు మిల్లు వీరన్న అలియాస్ కురువ వీరన్న, కర్నూలు వ్యక్తి ఈశ్వరయ్య గౌడ్‌ కు సుపారీ ఇచ్చారు.
ఈ హత్యలో పాల్గొన్న మొత్తం 10 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో హత్య కోసం ఉపయోగించిన బొలెరో, నాలుగు కార్లు, రెండు బైకులు, 11 సెల్‌ఫోన్లు, 13 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సుపారీ మొత్తం రూ.25 లక్షలకు ఒప్పందం కుదర్చగా, ముందుగా రూ.8 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు నిర్దారించారు .