వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా నా భార్య
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయంపై ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో తన భార్య సచీదేవికి, సీఎం జగన్ టికెట్ ఇస్తారేమోనని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పెద్ద ఎత్తున మహిళలకు టికెట్లు కేటాయించవచ్చని చెప్పారు. సింగరాయకొండ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న బాలినేని ఈ రకమైన కామెంట్స్ చేశారు. సీఎం జగన్ ఏది చెప్తే అదే చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో నీకు టికెట్ ఇవ్వడం లేదు.. మీ భార్య సచీదేవికి ఇస్తానని జగన్ చెబితే.. తాను కూడా పోటీ నుంచి వైదొలగాల్సి వస్తోందన్నారు. బాలినేని వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో కొంచెం అటూఇటూగా ఉన్న నియోజకవర్గాల్లో మహిళలను రంగంలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారా అన్న అభిప్రాయం.. బాలినేని కామెంట్స్‌ను బట్టి కలుగుతోంది.
