Home Page SliderInternational

‘బైడెన్‌కే నా ఓటు’..తేల్చి చెప్పిన మిలందా గేట్స్

బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా గేట్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తొలిసారిగా స్పందించారు. మహిళా సాధికారతకు అవకాశం కల్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కే తన ఓటు అని తేల్చి చెప్పారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య గట్టి పోటీ వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఓటు కీలకంగా మారింది. మిలిందా మాట్లాడుతూ “ఈ సారి ఎన్నికలలో నేను మౌనంగా ఉండలేను. ఈ ఎన్నికలు మహిళలకు, వారి భద్రత, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక శక్తి వంటి విషయాలలో వారి హక్కులను కాపాడే నాయకుడు కావాలి. ప్రజాస్వామ్యంలో మహిళలు పూర్తిగా భాగస్వాములవ్వాలని అందుకే తన మద్దతు ఈసారి అధ్యక్షుడు బైడెన్‌కే ఉంటుందని” తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. మరో వైపు మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు కూడా చేశారు. అతని హయాంలో మహిళల ఆరోగ్యం, భద్రతను ప్రమాదంలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గేట్స్ ఫౌండేషన్ తరపున 1.8 మిలియన్ డాలర్ల విరాళాలు అందించగా, ఎక్కువ భాగం డెమోక్రాట్లకే వెళ్లిందని సమాచారం.