Home Page SliderNational

నా గెలుపు ఖాయం: తమిళిసై

లోక్‌సభ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉందని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆమె తమిళనాడులోని చెన్నై సౌత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేయనున్నారు. ఈ నెల 25న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, తనకు చిన్నతనం నుండే ఎలక్షన్ వర్క్‌లో అనుభవం ఉందని ఆమె చెప్పారు.