Home Page SliderInternational

నా సూపర్ స్టార్ ఎప్పటికీ ఆమే…ప్రభాస్

తన లైఫ్‌టైమ్ సూపర్ స్టార్ ఎప్పటికీ ‘దీపికా పదుకొనే’ అన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. దీపిక చాలా అద్భుతమైన నటి అని చాలా అందంగా ఉంటుందని ఒక ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఇంటర్యూలో ప్రభాస్ చెప్పారు. ఆమెతో నటించే అవకాశం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నానని, ఇప్పటికి వీలయ్యిందని తన మనసులో మాట బయటపెట్టారు. ఆమెతో కల్కి చిత్రంలో నటించేటప్పుడు ఆమె అడుగుపెట్టిన ప్రతిసారీ సెట్స్‌లో అందరిలో చాలా ఉత్సాహం వస్తుందన్నారు.  

భారీ బడ్జెట్‌తో నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్న ‘కల్కి’ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ సమయంలో ప్రాజెక్ట్ కె అని పేరు పెట్టిన ఈ చిత్రానికి అమెరికాలో జరిగిన శాండియాగో కామిక్ కాన్ వేడుకలలో ‘కల్కి 2898 ఏడీ'( kalki 2898 AD) అని టైటిల్‌ను ప్రకటించారు. అప్పుడు విడుదల చేసిన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మొదట 2024 జనవరి 12న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ టీజర్‌లో కేవలం 2024 అని మాత్రమే చూపించారు. దీనితో ఈ చిత్ర విడుదల తేదీపై సందిగ్థత నెలకొంది.