‘నా కుమారుడే ట్రంప్ విజయానికి కారణం’..మెలానియా
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుపొందడానికి తన కుమారుడు బారన్ కీలక పాత్ర వహించారని ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికలలో యువతను ఆకట్టుకునేందుకు ఎన్నో వినూత్న పద్దతులు బారనే గుర్తించి అమలు చేశాడన్నారు. ఫోన్స్, పాడ్‌కాస్ట్‌ల ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేశాడని పేర్కొన్నారు. తన తండ్రి ఎవరిని సంప్రదించాలి ? ఎవరితో, ఎలా మాట్లాడాలి? వంటి విషయాలలో బారన్ ట్రంప్‌కు మంచి సలహాలు ఇచ్చారన్నారు. గతంలో బారన్ తనకు ‘సీక్రెట్ వెపన్’ అని ట్రంప్ కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే.

