మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కో-ఆర్డినేషన్ మాత్రమే
కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అవకతవకల అంశంలో విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రెండోరోజు విచారణ కొనసాగింది. ఈ రోజు విచారణకు ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ సోమేశ్ కుమార్ అటెండయ్యారు. ఈ సందర్భంగా కమీషన్ ఇరువురికి పలు కీలక ప్రశ్నలను సంధించింది. కేబినెట్ ఆమోదం లేకుండానే 3 బ్యారేజీలకు పరిపాలన అనుమతులు ఇచ్చారా? అని కమీషన్ స్మితా సబర్వాల్ ను ప్రశ్నించగా.. ఆమె స్పందన ‘నాకు తెలియదు, అవగాహన లేదు’ అని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎంవోకి వచ్చే ప్రతి ఫైల్ కు సీఎం ఆమోదం ఉంటుందని, సీఎంవోలో తాను ఏడు శాఖలను చూసినట్లు స్మితా సబర్వాల్ కమిషన్ కు చెప్పారు. ‘మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కో-ఆర్డినేషన్ మాత్రమే’ నని ఆమె వివరించారు. మరోవైపు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విచారణ కోర్టు హాల్లోకి పిలిచిన వెంటనే రాకపోవడంతో సీరియస్ అయ్యారు.

