తెలంగాణ సీఎంగా విజయశాంతి ?
ఈ మాట వినడానికి ఒకింత విడ్డూరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ రాజ్యాంగంలో ఇది ఏమాత్రం అసాధ్యం కాదు.కల అంత కంటే కాదు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాది లోపే విపరీతమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు.ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని బేస్ లెస్ గా చేయడంలో హైడ్రా ప్రధాన పాత్ర పోషించనుంది. అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా సరే అభివృద్ది చేసి నాలుగు కాలల పాటు తమ ఫోటోని పేద ప్రజల ఇళ్లల్లో ఉండాలని కోరుకుంటారు.కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతీ నిర్ణయం ప్రజావ్యతిరేకతగానే గోచరిస్తుంది.ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం సీఎం రేవంత్ అసంబద్ద పాలన విషయంలో గుర్రుగా ఉన్నట్లు జాతీయ మీడియా కోడై కూస్తుంది.ఈ నేపథ్యంలో మళ్లీ అంతటి చరిష్మా ఉన్న నాయకుడు తెలంగాణ కాంగ్రెస్ లో బహుశా అధిష్టానానికి కనిపించి ఉండకపోవచ్చు.ఆ కారణంగానే రాములమ్మకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలను సీఎం, మంత్రులను చేస్తుంటారు.వాళ్లకు నచ్చితే ఎవరినైనా అందలం ఎక్కిస్తుంటారు.నచ్చనప్పుడు పాతాళానికి తొక్కేస్తుంటారు.ఆ సమయంలో వాళ్ళకు పార్టీ ముఖ్యం కాదు.అలా ముఖ్యం అనుకుంటే అసలు జగన్‌ని పక్కన పెట్టే వాళ్ళే కాదు.ఇప్పుడు రేవంత్ విషయంలోనూ అదే జరుగుతుంది. రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళనే ముఖ్యమంత్రులు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది.సో ఇప్పుడు రాములమ్మ టైం నడుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు అధిష్టానానికి విధేయతగా ఉన్నప్పటికీ పార్టీలో సమన్వయంగా ఉండే ఫిగర్ అంటూ ఒకరుండాలి.అది రేవంత్ విషయంలో చేసిన తప్పులా ఉండరాదు.మరీ ముఖ్యంగా ఇగోయిజం ప్రదర్శించే లీడర్ అసలే అయ్యుండరాదు.కోమటిరెడ్డి,వీహెచ్ లాంటి సీనియర్లు కూడా మహిళను ముఖ్యమంత్రిని చేస్తానంటే వ్యతిరేకించే పరిస్థితి ఉండబోదు.అదే మేల్ లీడర్‌ని సీఎంని చేస్తామంటే ఈ టైంలో వ్యతిరేకత పెచ్చుమీరొచ్చు. అందుకే ఈసారి మహిళతో ప్రయోగం చేసి సక్సెస్ కొట్టాలని చూస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. నిదానంగా రాములమ్మను సీఎం పీఠం మీద కూర్చోబెట్టే ఆలోచనతో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినట్లు తెలుస్తుంది.