National

‘మా మమ్మీని అరెస్టు చెయ్యాల్సిందే ‘ మూడేళ్ల బుడతడి మంకుతనం

మధ్యప్రదేశ్‌ బుర్హాన్‌పూర్, మనసర్కార్

పసి పిల్లలు ఏంచేసినా ముద్దుగానే ఉంటుంది. మధ్యప్రదేశ్‌లోని ఏ ఊరిలో ఒక మూడేళ్లబాలుడు తల్లిపై చేసిన  ఫిర్యాదు కూడా అలాంటిదే. ‘మాఅమ్మ నాకు కాటుక పెడుతోంది’ ఆమెను జైల్లో పెట్టడంటూ ఆ పసివాడు చేసిన కంప్లైంటుకి మనసారా నవ్వుకున్నారు పోలీసులు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా దేఢ్‌తలాయ్ గ్రామంలో మూడేళ్ల బాలుడు సద్దామ్‌కి వాళ్ల అమ్మ స్నానం చేయించి కాటుక పెడుతుందట. అది అతడికి ఇష్టం లేక అల్లరి చేయడంతో చిన్నగా కొట్టిందట. అంతే ఏడుపు అందుకుని తండ్రిని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. అక్కడ సబ్-ఇనస్పెక్టర్ ప్రియాకా నాయక్‌కు తన సమస్య చెప్పుకుని, తల్లిపై కంప్లైంటు తీసుకోవల్సిందేనని మారాం చేసాడు. అక్కడ ఫిర్యాదు రాయించి సంతకం కూడా చేశాడు. ఆపై నమస్కారం చేసి, థాంక్స్ చెప్పడంతో వారికి నవ్వు ఆగలేదు.