Home Page SliderNationalSports

క్రికెట్‌తోనే నా ప్రేమ : స్మృతి మంథాన

తన జీవితంలో క్రికెట్ కు మించిన ప్రాధాన్యత ఎందులోనూ లేదని భారత మహిళల జట్టు స్టార్ స్మృతి మంథాన స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ తాను క్రికెట్ నే ప్రేమిస్తున్నానని, భారత జెర్సీని ధరించడం ద్వారా ఎంతో ప్రేరణ పొందుతానని పేర్కొంది. 2013లో క్రికెట్ ఆరగేట్రం చేసిన స్మృతి ఇటీవల ప్రపంచకప్ సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఇటీవల స్మృతి మంధాన పెళ్లి ఇటీవల అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలన్నీ స్మృతి డెలీట్ చేసింది. ఆమె స్నేహితులైన ఇతర భారత క్రికెటర్లు కూడా సోషల్ మీడియా నుంచి వీడియోలు, ఫొటోలు తీసేశారు. తాజాగా స్మృతి, పలాష్ ఇద్దరూ తమ పెళ్లి రద్దయ్యిందని ప్రకటించేవరకూ సోషల్ మీడియాలో రూమర్లు హల్ చల్ చేశాయి. ఈ ఘటన తర్వాత తన ప్రపంచకప్ విజయంపై నోరు విప్పింది స్మృతి. క్రికెట్ జీవితంలోనే ముందుకు కొనసాగుతానని వెల్లడించింది.