‘ఈ దృశ్యాలు చూసి గుండె పగిలిపోయింది’..చిరంజీవి
జమ్మూకశ్మీర్‌లోని మిని స్విట్జర్లాండ్‌గా పేరు పొందిన పహల్గామ్‌లో 30 మంది అమాయక ప్రజలను, పర్యాటకులను తీవ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సైనిక దుస్తులలో వచ్చి పర్యటకులపై నేరుగా జరిపిన ఈ ఉగ్రదాడి తీవ్ర సంచలనం కలిగించింది. ఈ క్రూరమైన చర్యపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ ఇది చాలా భయంకరమైన దాడి అని, వారి దృశ్యాలు చూస్తుంటే గుండె పగిలిపోయిందని వ్యాఖ్యానించారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేయడం తప్ప, వారి నష్టాన్ని ఏదీ పూడ్చలేదని పేర్కొన్నారు. ప్రముఖ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హృదయవిదారకమైన ఈ ఘటనపై విమర్శలు కురిపించారు. మరణించినవారి కుటుంబాలకు న్యాయం జరగాలని పేర్కొన్నారు.