మా తాత రసికుడు..
హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. తాతా – మనవడు సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కడంతో.. చిరు తాత ఫోటోని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన తాత గురించి చెప్పారు. నీకు ఎవరి బుద్ధులు వచ్చినా పర్లేదు కానీ, మీ తాత బుద్ధులు మాత్రం రాకూడదని మా అమ్మ తరచూ చెప్పేదని తెలిపారు. ఎందుకంటే తమ తాత మహా రసికుడని, తనకు ఇద్దరు అమ్మమ్మలని, ఇద్దరు ఇంట్లో ఉండేవారు. వీళ్లిద్దరి మీద అలిగితే.. మూడో వ్యక్తి దగ్గరకు వెళ్లేవారు. పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన వ్యక్తి కావడంతో, జాలి పడి ఆమెకు అతి దగ్గరయ్యారు. అలా తనకు తెలిసి ముగ్గురు ఉన్నారు. ఇంకా ఎంత మంది ఉన్నారో నాకు తెలియదు అని కడుపుబ్బా నవ్వారు. అయితే తన తాత రసికుడు అయినప్పటికి.. దాన ధర్మాలు బాగా చేసేవారని చెప్పుకొచ్చారు.