రజినీకాంత్‌తో నా తొలి సినిమా.. వెట్టైయాన్‌లో మంజువారియర్
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం వెట్టైయాన్. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేష్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు రజినీకాంత్. వీటిలో ఒకటి వెట్టైయాన్. తలైవా 170గా తెరకెక్కుతున్న చిత్రం. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. వెట్టైయాన్ పర్‌ఫెక్ట్ కాంబినేషన్. ఇందులో రజినీకాంత్ సార్ సతీమణిగా కనిపిస్తా. రజినీ సార్‌తో నా తొలి సినిమా ఇది. నా పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుందని చెప్పుకొచ్చింది.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన వెట్టైయాన్ టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రజినీకాంత్ మరోవైపు తలైవా 171గా తెరకెక్కుతున్న కూలి చిత్రంలో కూడా నటిస్తున్నారని తెలిసిందే.