నా ఫేవరెట్ ‘పవర్ స్టారే’ అన్న తమిళ స్టార్ హీరో
తన ఫేవరెట్ స్టార్ తెలుగులో ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ అని తేల్చి చెప్పారు తమిళ స్టార్ హీరో ధనుష్. తనకు తమిళంలో రజనీ కాంత్ అంటే ఇష్టమని, తెలుగులో పవన్ అంటే ఇష్టమని అభిమానులతో ట్విటర్‌లో మాట్లాడుతూ తెలియజేశారు. పవన్ గురించి చెప్పిన ఈ మాటలు చాలా ఇన్‌స్టెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమిళంలో విజయ్, అజిత్‌లలో ఎవరు ఇష్టమంటే ఇద్దరూ తనకు ఇష్టమేనని కానీ రజనీ అంటే ఆరాధన అని తెలియజేశాడు. తనకు సమంతతో పని చేయడం చాలా గర్వంగా ఉందని, ఆమె చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన సార్ సినిమా సక్సెస్‌తో ఖుషీగా ఉన్నారు ధనుష్. ఇప్పుడు ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ధనుష్.

