Home Page SlidermoviesNational

‘మా నాన్న లెజెండ్’..అమీన్

ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ తన తండ్రిపై వస్తున్న కథనాలపై ప్రతిస్పందించారు. తన తండ్రి రెహమాన్‌పై విడాకుల కారణంగా వస్తున్న పుకార్లు వింటుంటే తనకు చాలా బాధగా ఉంటుందని పేర్కొన్నారు. తన తండ్రి వ్యక్తిగతంగా ఎంతో గొప్ప వ్యక్తి అన్నారు. వృత్తి పరంగా కూడా సమోన్నత శిఖరాలు అధిగమించారని, ఆయన ఒక లెజెండ్ అని పేర్కొన్నారు. ఆయనపై ఎలాంటి ఆధారాలు లేకుండా పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని బాధను వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రెహమాన్, సైరాభానుల విడాకుల వార్త వచ్చిన రోజే రెహమాన్ బృందంలోని మోహినిదే అనే మహిళ కూడా భర్త నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో రకరకాల కథనాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీనితో రెహమాన్ పిల్లలు స్పందిస్తున్నారు. ఆయన కుమార్తె రహీమా కూడా ఇన్‌స్టా వేదికగా పనికిరాని వాళ్లే వదంతులను అంగీకరిస్తారంటూ పోస్ట్ పెట్టారు.