“మా నాన్న సూపర్ హీరో”
సుధీర్ బాబు సుపర్ స్టార్ అల్లుడే కాదు టాలీవుడ్‌లో ఫేమస్ హీరో కూడా. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే ఆయన ఇటీవల రిలీజైన ‘హరోం హర’ మూవీ టైంలో పేరుకి ముందు దళపతి అనే ట్యాగ్‌ని తగిలించుకున్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు ఒక క్లాస్ సినిమాలో నటిస్తున్నారు. అదే “మా నాన్న సూపర్ హీరో”. తాజాగా ఈ సినిమా నుంచి సుధీర్ బాబు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు. అందులో ఆయన స్కూటర్ మీద వెళ్తూ ఎదురుగా వచ్చే పిల్లలకి చిరునవ్వుతో హాయ్ చెబుతున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకొంటోంది. కాగా ఈ చిత్ర టీజర్ సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.