Andhra PradeshHome Page Slider

‘నాన్న కోసం సిద్దమైన నా క్యూటీస్’.. రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్

తమ తండ్రి పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమైన రోజు కోసం నా క్యూటీస్ సిద్దమయ్యారు అని పవన్ మాజీ భార్య రేణుదేశాయి చేసిన పోస్టు వైరల్ అవుతోంది. నేడు చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్, రేణూల పిల్లలు అకీరా, ఆద్యలు సంప్రదాయ దుస్తుల్లో సిద్దమయ్యారు. తమ తల్లి రేణు దేశాయికి వీడియోకాల్ చేశారు. దీనితో వారి ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. నాన్నకు ముఖ్యమైన రోజు కోసం నా క్యూటీస్ సిద్దమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు, సమాజానికి మంచి చేయాలనే ఆంకాంక్షించే కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అని తన పోస్టులో పేర్కొన్నారు.